తాళ్లూరు వాసి జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు దార అంజయ్య దళిత కవులు రచయితలు సోషల్ సర్వీన్ నమ్మేళనంలో దళిత సేవా అవార్డును పొందారు. హైదరా బాద్ రవీంధ్ర భారతిలో పైడి తేరేష్ బాబు, కలేకూరి ప్రసాద్ మద్దూరి స్మారక కార్యక్రమంలో జరిగిన కార్యక్రమంలో దారా అవార్డు అందుకున్నారు. ప్రముఖ కవి రచయిత, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న చేతుల మీదుగా అవార్డు అందుకన్నారు. ఎమ్మెల్సీ వెంకన్న చేతుల మీదుగా అవార్డు అందుకోవటం పూర్వ జన్మ సుకృతం అని చెప్పారు.

