తాళ్లూరు మండలంలోని తూర్పుగంగవరం గ్రామంలో గురువారం రాత్రి ఈదురుగాలులతో కురిసినవర్షానికి విద్యుత్తు స్థంబాలు నేలవాలి, చెట్లు విరిగివిద్యుత్తుకు24 గంటలుగా అంతరాయం ఏర్పండింది. రాత్రి సమయంలో వీచిన గాలులకు గ్రామంలోని గుజ్జుల యోగిరెడ్డి పౌండ్రీ నుండి ఓబిసీ కాలువ వరకు ఇరువైపుల దాదాపు 5 విద్యుత్తు స్థంబాలు నేల కూలాయి. రెండు పెద్ద చెట్లువిరిగి పడి సమీనవిద్యుత్తు స్థంబాలు కూలిపోయియి. దీంతో ఆప్రాంతం అందకారంలో వుండి పోయింది. ఉదయం నుండి కూడా విద్యుత్తుశాఖ అధికారులు విద్యుత్తు పునరుద్దరణకు చర్యలు తీసుకోక పోవ టంతోఇబ్బందులు పడుతున్నామని ఆప్రాంత ప్రజలువాపోతున్నారు.
విద్యుత్తు లేక పోవటంతో వేసవి ఉక్క తట్టు కోలేక ప్రజకు అవస్థలు పడ్డారు. ఇళ్లలో బోరుమోటార్లు ఆడక సాధారణ నీటి సమస్యతో ఇబ్బందులు పడ్డారు. పశుపోషకులు వాటికినీరు అందించ లేక నానా కష్టాలు పడ్డారు. గేదెల షెడ్లు
గలయజమానులు కొందరు జనరేటర్లు బిగించి గేదెల దాహాం తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూల్ డ్రింక్ షాపుల్లోని శీతల పానీయాలకు విత్యుత్తు లేక అమ్మకాలు
జరుగక తీవ్రంగా నష్ట పోతున్నామని వాపోయారు. విద్యుత్తుకు విపత్తువల్ల అం లతరాయం జరిగితే యుద్ద ప్రాదిపదికన మరమ్మత్తులు చేయాల్సిన విద్యుత్తుశాఖ య ౦త్రాంగం ఆదిశగా పనిచేయటం లేదని ఆప్రాంతవాసులు బాహటంగా మిమర్శిస్తు న్నారు. ఇప్పటికయినా అధికార యంత్రాంగం స్పందించి మరమ్మత్తులు జరిపి విద్యుత్తు పునరుద్ధరించి ప్రజల కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.

