2026-27విద్యాసంవత్సరానికిగాను ఒంగోలు జవహార్ నవోదయ విద్యాలయములో 11వ తరగతిలో మిగులు సీట్ల భర్తీకొరకు దరఖాస్తులు కోరబడుచున్నవి. దరఖాస్తు సమాచారమును నవోదయ విద్యాలయ సమితి వెబ్ సైట్: www.navodaya.gov.in నుండి పొందవచ్చును. దరఖాస్తు చేసుకొనగోరే విద్యార్థులు ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల లేదా ప్రభుత్వముచే గుర్తింపు పొందిన పాఠశాలలో 2025-2026 విద్యాసంవత్సరంలో 10వ తరగతి చదివి, 10వ తరగతి పాస్ అయి ఉండాలి, మొత్తంమీద 60% మార్కులు పొంది, మరియు సైన్స్ గ్రూప్ కావల్సినవారు సైన్స్ సబ్జక్ట్ లో 60% మార్కులు, మ్యాథ్స్ గ్రూప్ కావల్సినవారు మ్యాథ్స్ సబ్జక్ట్ లో 60% మార్కులు తప్పనిసరిగా పొంది ఉండవలెను. 2025-2026 సంవత్సరమునకు కన్న ముందు 10 వ తరగతి పాస్ అయిన వారు అనర్హులు. అభ్యర్థులు 01-06-2009 నుండి 31-07-2011 మధ్యలో జన్మించి ఉండవలెను, దరఖాస్తు చేసుకొనుటకు చివరి తేది. 25.06.2026. పూర్తి చేసిన దరఖాస్తుతో పాటు 10వ తరగతి మార్కుల లిస్టుపైన H. M గారితో సంతకము చేయించి (General / OBC/SC/ST) , ప్రస్థుత ఆదాయ సర్టిఫికేట్,పస్తుత నివాస సర్టిఫికేట్ Thasildar గారి సర్టిఫికేట్లను జతపరచి, దరఖాస్తును నేరుగా విద్యాలయమునకు వచ్చి ఇవ్వవచ్చును. prakasamjnv@gmail.com అనే ఇమైల్ కు కూడా 25.06.2026 లోపు పంపించవచ్చును. లేదా మరిన్ని వివరాల కోసం విద్యాలయం వచ్చి తెలుసుకొని అప్లై చేసుకోవచ్చు.
కనుక అర్హులైన వారు జిల్లాలోని విద్యార్థులందరూ అవకాశాన్ని సద్వినియోగం పరుచుకోవాలని జవహార్ నవోదయ విద్యాలయ, ప్రిన్సిపాల్ సి.శివరాం గారు తెలియజేశారు.
నవోదయ విద్యాలయ 11వ తరగతి ప్రవేశమునకు దరఖాస్తులు ఆహ్వానము
14
Jun