రాష్ట్ర ప్రభుత్వ పాలన ప్రారంభమై రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా ఈనెల 18వ తేదీన ఒంగోలు నగరంలోని ఎస్ జి వి ఎస్ కళ్యాణ మండలంలో నిర్వహించనున్న విజయోత్సవ సభ ముందస్తు ఏర్పాట్లను బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, కనిగిరి శాసనసభ్యులు డా ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవ సంబరాలు ఒంగోలు నగరంలోని ఎస్ జి వి ఎస్ కళ్యాణ మండలంలో ఘనంగా నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్టేజి, సీటింగ్, స్టాల్స్, బందోబస్తు ఏర్పాట్లు ఎలాంటి పొరపాట్లుకు తావులేకుండా పటిష్టంగా చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవ సంబరాలు విజయవంతంగా నిర్వహించేలా అన్నీ శాఖల అధికారులు సమన్వయం తో పనిచేయాలన్నారు.
తొలుత జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగు సూచనలు జారీ చేశారు.
జిల్లా కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి మాధురి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


