ప్రకాశం
జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు, దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నియోజకవర్గ ఓటర్లకు కీలక సూచన చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.
బుధవారం దర్శిలోని తన నివాసంలో బిఎల్ ఓ రాయపాటి శ్రీను నుంచి శాసన సభ్యులు సార్ ఫారంను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 15వ తేదీ నుండి ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో సర్ కార్యక్రమం ప్రారంభం కానుందని తెలిపారు.
బిఎల్ఓ లు గ్రామాలకు వచ్చినప్పుడు ఓటర్లు సరైన పత్రాలు అందుబాటులో ఉంచుకొని వారికి సహకరించాలి. మీ ఓటు జాబితాలో ఉండేలా చూసుకోవడం మీ బాధ్యత అని శాసన సభ్యులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో దర్శి మండల పార్టీ అధ్యక్షులు వెన్నపూస వెంకట రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
