

ప్రజా ఆరోగ్యం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక, శ్రర్థం వహిస్తూ ప్రజల జీవనశైలీ, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రర్థ వహించేలా యోగా కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మండల విద్యాశాఖాధికారి గురుజాల సుబ్బయ్య అన్నారు. తాళ్లూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణలో ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం ను పురష్కరించుకుని యోగా కార్యక్రమాలు నిర్వహించారు. ఇన్చార్జి ఎంపీడీఓ శ్రీనివాస రావు మాట్లాడుతూ ప్రతి రోజు క్రమం తప్పకుండా యోగా చేస్తే క్రమశిక్షణతో కూడిన జీవనం అలవడుతుందని చెప్పారు. పీఈటీలు రవి ప్రసాద్ రెడ్డి, వెంకట నారాయణ, యోగా నిపుణుడు హనుమా రెడ్డి ఆధ్వర్యంలో యోగాన నాలు నిర్వహించారు. ఎపీఎం దేవరాజ్, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది పాల్ రాయల్, క్రిష్ణ చందు, ఎంఈఓ కార్యాలయ సిబ్బంది, గ్రామకార్యదర్శి వెంకటాద్రి, అంగన్వాడీ టీచర్లు, నచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

బొద్దికూరపాడు బిడిసీ ఎల్ నరస్వతి గ్రంధాలయం ఆధ్వర్యంలో కోదండా రామస్వామి ఆలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ను పురష్కరించుకుని యోగం- యోగాంధ్ర ప్రదేశ్ అనే అంశంపై విద్యార్థులకు వ్యాస రచన, వకృత్వ పోటీలు నిర్వహించారు. ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందించారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహిత, రిటైర్డు హెచ్ఎం ఎన్ అంజి రెడ్డి, యోగ ప్రాముఖ్యతను వివరించారు. ఉపాధ్యాయుడు పోలం రెడ్డి సుబ్బా రెడ్డి విద్యార్థులచే యోగాననాలు వేయించారు. బిడీసీఎల్ గ్రంధ పాలకురాలు పద్మావతి తదితరులు పాల్గొన్నారు.