విద్యుత్ షాక్ తో తాళ్లూరు మండలంలోని కొత్త పాలెం గ్రామానికి చెందిన మారం అంజి రెడ్డి (44) మంగవారం మృతి చెందాడు. తన పొలంలో పశువుల మేత కోస్తున్న సమయంలో పొలంలో గాలులకు తెగి పడిన విద్యుత్ లైన్ తీగ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇరువురు కుమార్తెలు ఉన్నారు. ‘విద్యుత్ ఎఈ రామక్రిష్ణా రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. రైతుకు విద్యుత్ శాఖ ద్వారా తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పోలీన్ కానిస్టేబుల్ పి దాను సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసారు.
ఎస్పై మల్లిఖార్జున రావు దర్యాప్తు చేస్తున్నారు.
