అధిక రసాయన ఎరువులు వాడకం అనర్థదాయకమని దర్శి కృషి విజ్ఞాన శాస్త్రవెత్త డాక్టర్ తూము వెంకటేశ్వర రెడ్డి అన్నారు. తాళ్లూరు మండలంలోని లక్కవరం, దోసకాయలపాడు గ్రామాలలో మంగళవారం కేత్ బజావో అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవెత్త టి వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ దేశంలో అధిక రసాయనిక ఎరువులు వాడుతున్న జిల్లాలలో మన జిల్లా ప్రధమ స్థానంలో ఉన్నట్లు చెప్పారు. ప్రత్యామ్నాయ ఎరువులైన జీవన ఎరువులు, సేంద్రీయ, పశువుల, వాన పాముల ఎరువులను వాడాలని చెప్పారు. ఎరువులు వాడుకున్నట్లయితే సాగు ఖర్చు తగ్గుతుందని అన్నారు. ఎల్ నినో ప్రభావం నైరుతి రుతు పవనాలు మందగించి తేలికపాటి, జల్లులు, ఒకే సారి పెద్ద వర్షం పడుతున్నట్లు చెప్పారు. ఈశాన్య రుతు పవనాలు ఆశాజనకంగా ఉండవని అన్నారు. రైతలు ఆరు తడి పంటలు వేసుకోవాలని కోరారు. ఎరువుల లభ్యతపై రైతులకు అవగాహన కల్పించారు.
