
తాళ్లూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరధిలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో 97 శాతం నమోదు అయినట్లు పీహెచ్సీ వైద్యాధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. పీహెచ్సీ పరిధిలో 2176 మందికి గాను 2124 మందికి పల్స్ పోలియో చుక్కలు వేసినట్లు చెప్పారు. మరో రెండు రోజుల పాటు ఇంటింటి సర్వే నిర్వహించి నూరు శాతం సాధించినట్లు చెప్పారు. సి హెచ్ రమణమ్మ, హెల్త్ సూపర్ వైజర్ పి వి రవి పీ హెచ్ ఎన్ వై విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

తూర్పుగంగవరం పీహెచ్సీ పరధిలో 90శాతం పల్స్ పోలియో నమోదు అయినట్లు పీహెచ్సీ వైద్యాధికారి మౌనిక తెలిపారు. 2374 మందికి గాను 2150 మంది పోలియో చుక్కలు వేసినట్లు మరో రెండు రోజుల పాటు పల్స్ పోలియో ఇంటింటికి వేయనున్నట్లు చెప్పారు. హెచ్ఓ చంధ్రశేఖర్, హెచ్ వీ నుశీల, ఫార్మాసిస్ట్ శిల్ప, ఎల్ టీ కోటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
