హెచ్‌ఎంఆర్‌ఎల్ అదనపు ఎండీగా అజిత్ రెడ్డి బాధ్యతల స్వీకరణ.

హైదరాబాద్, జూలై 1(జే ఎస్ డి ఎం న్యూస్) :
హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) అదనపు మేనేజింగ్ డైరెక్టర్‌గా బి.అజిత్ రెడ్డి బుధవారం బాధ్యతలుస్వీకరించారు. రసూల్‌పురాలోని మెట్రో రైల్ భవన్‌లో ఆయన శాస్త్రోక్తంగా బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా హెచ్‌ఎంఆర్‌ఎల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శివేంద్ర ప్రతాప్ ఆయననుమర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం అదనపు ఎండీ అజిత్ రెడ్డి హెచ్‌ఎంఆర్‌ఎల్ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మెట్రో ఫేజ్-1, ఫేజ్-2 ప్రాజెక్టుల తాజా పురోగతి, ప్రస్తుత పరిస్థితిని ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. నూతన అదనపు ఎండీని కలుసుకుని అభినందనలు తెలిపిన వారిలో హెచ్‌ఎంఆర్‌ఎల్ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ బి.ఆనంద మోహన్, జనరల్ మేనేజర్లు ఎం.విష్ణువర్ధన్ రెడ్డి, డి.సూర్యప్రకాశం, శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ ఇంజినీర్ వై. సాయపరెడ్డి తదితరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *