ఉద్యాన పంటల సాగులో సేంద్రీయ పద్ధతులు ఉత్తమమైన పద్దతులు అని జిల్లా ఉద్యాన వన శాఖాధికారి వై ఎం ఎన్ వి ఏన్ గోపి చంద్ అన్నారు. మండలంలోని నాగంబొట్ల పాలెం లో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఉద్యాన శాఖ రైతులకు సేంద్రీయ పద్దతులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఉ ద్యాన శాఖాధికారి గోపిచంద్ మాట్లాడుతూ సేంద్రీయ పద్దతుల వలన రైతులు సాగు చేసిన పంటలకు మరింత గిట్టుబాటు వస్తుందని, ఆరోగ్య కరమైన పంటలు పండిస్తే భూమికి, ప్రజలకు ఎంతో ఉపయోగకరమని, ఉ ద్యాన పంటలకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను వివరించారు. దర్శి ఉద్యాన పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్ర వెత్త డాక్టర్ ఎం ఠాగూర్ నాయక్ మాట్లాడుతూ నిమ్మ, బత్తాయి పంటలలో చేపట్టవలసిన నస్యరక్షణ యాజమాన్య పద్దతులను వివరించారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖాధికారి ఎం రవి వెంకన్న బాబు, సహాయకులు సీహెచ్ శ్రీ లక్ష్మిప్రియ తదితరులు పాల్గొన్నారు. అనంతరం క్షేత్ర స్థాయిలో బత్తాయి తోటలను పరిశీలించారు.



