డిపిఆర్ఓ రమేష్ కు ఘన వీడ్కోలు – అసిస్టెంట్ డైరెక్టరుగా ప్రమోషన్ పొంది కడపకు బదిలీ.

​ప్రకాశం జిల్లా పౌర సంబంధాల శాఖాధికారి (DPRO)గా విశిష్ట సేవలందించి, అసిస్టెంట్ డైరెక్టర్ (AD)గా ప్రమోషన్ పై కడప జిల్లాకు బదిలీ అవుతున్న సందర్భంగా ఆయనకు సమాచార శాఖ కార్యాలయ సిబ్బంది శనివారం ఘనంగా వీడ్కోలు పలికారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో సిబ్బంది అందరూ కలిసి ఆయనను శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించి, జ్ఞాపికను బహూకరించారు. డిపిఆర్ఓ గా 2024 జనవరిలో ప్రమోషన్ పొంది ఆయన ఒంగోలుకు వచ్చారు.ఎంతో సవాలుతో కూడుకున్న ఎన్నికల విధులను అత్యంత సమర్థంగా నిర్వహించారు. ఆయన అంకితభావానికి గుర్తింపుగా అప్పటి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన ఉత్తమ అధికారి అవార్డును అందుకోవడం ఆయన పనితీరుకు నిదర్శనమని సిబ్బంది కొనియాడారు.
​విధుల పట్ల ఆయన చూపిన నిబద్ధత, క్రమశిక్షణ, కార్యాలయ సిబ్బందితో స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించిన తీరు ప్రశంసనీయమని వక్తలు పేర్కొన్నారు. మీడియా రంగానికి, ప్రభుత్వానికి మధ్య ఒక బలమైన వారధిగా నిలిచి, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషించారని, జిల్లాలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారని గుర్తుచేసుకున్నారు.
పనిని ప్రేమిస్తూ, సిబ్బందికి ఎల్లప్పుడూ దిశానిర్దేశం చేసే ఇంతటి ఉత్తమ అధికారి కడప జిల్లాకు బదిలీ కావడం ఒంగోలు సమాచార శాఖకు తీరని లోటని ఉద్యోగులు, సిబ్బంది ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన కడప జిల్లాలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
​ఈ కార్యక్రమంలో ఒంగోలు డివిజనల్ పీఆర్‌ఓ దుర్గా ప్రసాదరావు, సీనియర్ అసిస్టెంట్ ధనలక్ష్మి, సమాచార శాఖ కార్యాలయ సిబ్బంది పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *