సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఘోరంనడుస్తున్న రైల్లో పురుగుల మందు తాగిన ప్రేమికులు

సికింద్రాబాద్, జూలై 7,(జే ఎస్ డి ఎం న్యూస్) :
చైన్నై-సికింద్రాబాద్ మధ్య నడిచే శబరి ఎక్స్‌ప్రెస్‌లోమంగళవారం మధ్యాహ్నం తీవ్ర కలకలం రేగింది. వివాహేతర సంబంధం కారణంగా ఓ జంట రైలులోనే పురుగుల మందు తాగిఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా మేలియాపుట్టి మండలం చాపర గ్రామానికి చెందిన శ్రీరామ్ శిరీష్ కుమార్ (34)కు సులోచన అనే మహిళతో వివాహమై ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, అదే గ్రామానికి చెందిన వివాహిత తో శిరీష్ కుమార్‌కు గత రెండు నెలలుగా వివాహేతరసంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో నెల రోజుల క్రితం వీరిద్దరూ ఊరు విడిచి కోయంబత్తూరు పారిపోయారు.
విషయంతెలుసుకున్న శిరీష్ కుమార్ భార్య సులోచనకోయంబత్తూరు వెళ్లి వారిద్దరినీ పట్టుకుంది. ఇద్దరికీ నచ్చజెప్పి, కౌన్సిలింగ్ ఇచ్చి తిరిగి
హైదరాబాద్ తీసుకువచ్చేందుకు ఒప్పించింది. ఈ క్రమంలో ముగ్గురూ కలిసికోయంబత్తూరులో శబరి ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్ 20630) జనరల్ బోగీ ఎక్కారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో రైలు సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకుంటున్న సమయంలో, సులోచన కన్నుగప్పి శిరీష్ కుమార్, నీలవేణి ఇద్దరూ వెంట తెచ్చుకున్న విషపదార్థాన్ని సేవించారు. క్షణాల వ్యవధిలోనే వారిద్దరూ స్పృహతప్పి పడిపోవడంతో భయాందోళనకు గురైన సులోచన వెంటనే స్టేషన్ అధికారులకు సమాచారం అందించింది.
రైల్వే డిప్యూటీ ఎస్ఎస్ ఎం.బి.ఎస్. కుమారి సమాచారం మేరకు రైల్వే హెడ్ కానిస్టేబుల్ పి. మునీశ్వర్ రావు వెంటనే జనరల్ బోగీలోకి దూసుకెళ్లారు. స్పృహతప్పి కొట్టుమిట్టాడుతున్న బాధితులను 108 అంబులెన్స్ సహాయంతో అత్యవసర చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. భార్య సులోచన ఇచ్చిన సమాచారం మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *