రాంగోపాల్ పేట జూలై 7 ,(జే ఎస్ డి ఎం న్యూస్) :
సికింద్రాబాద్లోని ప్రసిద్ధ శ్రీ ఉజ్జయినీ మహంకాళిఅమ్మవారి దేవాలయానికి రెండేళ్ల కాలపరిమితితో నూతన ట్రస్ట్ బోర్డును నియమించినందుకు బోయిన్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, ఏపీటీఎస్ (APTS) డైరెక్టర్ ముప్పిడి గోపాల్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి,సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డా .కోట నీలిమలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ కమిటీ ఏర్పాటుకు సహకరించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, లక్ష్మణ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, డాక్టర్ కోట నీలిమలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అమ్మవారి ఆలయ అభివృద్ధి మరింతగా కొనసాగుతుందని ముప్పిడి గోపాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎం. కిరణ్ కుమార్, రమేష్, సామ్సన్ రాజు, హన్మంతు, దర్గా, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
