ఓ మహిళపై ఇద్దరు వ్యక్తుల అత్యాచారం.

బేగంపేట జులై 7,(జే ఎస్ డి ఎం న్యూస్) :
భర్తతో ఉన్న సమస్య పరిష్కారం కోసం ఓ టీవీ ఛానల్
నిర్వహిస్తున్న బతుకు జట్కా బండి కార్యక్రమం కోసం వచ్చిన ఓ మహిళను టీవీ షోకు తీసుకొని వెళతామని చెప్పి నమ్మించిన ఇద్దరు వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం మహబూబాబాద్ లోని ఓ తాండాకు చెందిన ఓ మహిళకు (43)కు 9 ఏళ్ల క్రితం సిరిసిల్లకు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి 7 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే గత కొద్ది రోజుల నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండటంతో మూడు రోజుల క్రితం ఆమె తన పుట్టింటికి వెళ్ళింది . అయితే ఓ టీవీ చానల్ లో ప్రసారమయ్యే బతుకు జట్కాబండి కార్యక్రమానికి వెళితే తన సమస్య పరిష్కారం అవుతుందని బావించిన ఆమె ఈ నెల 6వ తేదీన మహబూబాబాద్ లో రైలు ఎక్కి నగరానికి వచ్చింది. అయితే ఆ టీవీ చానల్
కార్యాలయం కోసం నగరంలోని వివిధ ప్రాంతాల్లో తిరిగిన ఆమె మంగళవారం తెల్లవారు జామున సికింద్రాబాద్ రైల్వే స్టేషను వచ్చింది. అదే సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చి ఎక్కడికి వెళ్లాలని అని అడుగటంతో బతుకు జట్కాబండి గురించి చెప్పింది. అయితే తనకు తెలిసిన వ్యక్తి టీవీ చానల్ వాళ్ళతో సంబంధాలు ఉన్నాయని తనతో వస్తే తీసుకుని వెళతానని నమ్మించాడు. ఇద్దరు కలిసి ఎంజీ రోడ్డులోని హైదర్ కాంప్లెక్స్ దగ్గరకు వచ్చారు. అదే కాంప్లెక్స్ లో నిర్మాణుష్యంగా ఉన్న చోటుకు తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అంతేకాకుండా అలాగే నిందితుడు తన స్నేహితుడిని పిలిపించడంతో అతను కూడా ఆమెపై అత్యాచారం చేశాడు. అటు తర్వాత ఆమె గట్టిగా అరువడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే ఆమె స్థానికుల సహాయంతో మహంకాళి పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసికుని ధర్యాప్తు ప్రారంభించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *