గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంపై మరింత అప్రమత్తంగా ఉండి ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణానికి సహకరించాలని తూర్పుగంగవరం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ మౌనిక కోరారు. పీహెచ్ సి లో గురువారం పీఎం నురక్షిత్ మాతృత్వ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. రక్తహీనత గురించి వివరించి, 25 మందికి పలు పరీక్షలు నిర్వహించి అందుకు సంబంధించిన మందులను అందించారు. అంగన్ వాడీ ద్వారా అందిస్తున్న పౌష్టికాహారాన్ని క్రమంగా తప్పకుండా తీసుకుని హిమోగ్లోబిన్ శాతం తగ్గకుండా చూసుకోవాలని కోరారు.

డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవ కార్యక్రమం నిర్వహించారు. మురుగు నీటి నిల్వలపై, దోమల నివారణపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, హెచ్ ఓ చంద్రశేఖర్ బాబు, పీహెచ్ ఎన్ ఎం వీ రమణమ్మ, హెచ్పీ సుశీల, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
