దేవాలయాల్లో వరుస చోరీలు, రాత్రిపూట ఇళ్లలో, షాపుల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు……రూ.3.50 లక్షల విలువైన నగదు, బంగారు ఆభరణాలు, ఇత్తడి గంటలు, ద్విచక్ర వాహనం స్వాధీనం- దర్శి సర్కిల్ పరిధిలో ఇటీవల జరిగిన దేవాలయ చోరీలు, రాత్రిపూట ఇళ్లలో మరియు వ్యాపార సంస్థలో జరిగిన దొంగతనాల కేసులను ఛేదించినట్లు గా వెల్లడించిన దర్శి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వై. రామారావు.

ప్రకాశం జిల్లా పోలీసు ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, దర్శి డీఎస్పీ P. బాలమురళీకృష్ణ పర్యవేక్షణలో, దర్శి సీఐ వై. రామారావు ఆధ్వర్యంలో తాళ్లూరు ఎస్సై S.మల్లికార్జున రావు, దొనకొండ పోలీస్ స్టేషన్ ఎస్సై L.రామకృష్ణ మరియు సిబ్బంది కలిసి ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, సుమారు రూ.3.50 లక్షల విలువైన నగదు, బంగారు ఆభరణాలు, ఇత్తడి గంటలు మరియు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది.
ఈ నెల 5వ తేదీ రాత్రి తాళ్లూరు మండలం నాగంబొట్లవారిపాలెం గ్రామ శివారులోని కాటమరాజు దేవాలయంలో ఇత్తడి గంటలు చోరీకి గురైన ఘటనపై తాళ్లూరు ఎస్సై S.మల్లికార్జునరావు కేసు నమోదు చేసి, పాత నేరస్తుల కదలికలను విశ్లేషించి పొదిలికి చెందిన పొదిలి నరసింహ రావు s/o చిన్న వెంకటేశ్వర్లు, వయస్సు 33 సంవత్సరాలు, ఓబిలశెట్టి వారి వీధి, పొదిలి టౌన్ అను అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా కాటoరాజు గుడిలో ఇత్తడి గంటలను దొంగతనం చేసినట్లు తేలింది.
అంతేగాక దొనకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగినపూడి గ్రామ శివాలయంలో హుండీ పగులగొట్టి రూ.1,000 నగదు, అలాగే నల్లబోతువారిపాలెం గ్రామంలోని పోలేరమ్మ దేవాలయంలో హుండీ పగులగొట్టి రూ.10,000 ను కూడా నగదు అపహరించినట్లు తెలిపాడు.
నిందితుడి వద్ద నుంచి సుమారు రూ.60,000 విలువైన 40 ఇత్తడి గంటలు (సుమారు 50 కిలోల బరువు) స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా పొదిలి పట్టణంలో జరిగిన ద్విచక్ర వాహన చోరీ కేసులో కూడా ఇదే నిందితుడి ప్రమేయం ఉన్నట్లు తేలడంతో, రూ.90,000 విలువైన ద్విచక్ర వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకోవడమైనది వెల్లడించారు.
పొదిలి నరసింహారావుపై గతంలో వివిధ పోలీస్ స్టేషన్లలో సుమారు 40 చోరీ కేసులు నమోదై ఉన్నట్లు విచారణలో తేలింది.
మరో కేసులో దొనకొండ ఎస్సై L.రామకృష్ణ మరియు వారి సిబ్బంది, మేకల ధనరాజ్ తండ్రి లాబాను, వయస్సు 19 సంవత్సరాలు, ఎర్రబాలెం గ్రామం, దొనకొండ మండలం ను అదుపులోకి తీసుకుని విచారించగా, ఈ నెల 3వ తేదీన దొనకొండలోని ఒక కొరియర్ కార్యాలయంలో రూ.50,000 నగదు, ఒక మొబైల్ ఫోన్ దొంగిలించినట్లు, అలాగే పడమటి వెంకటాపురం గ్రామంలో పగటి సమయంలో ఒక ఇంటిలో చొరబడి నల్లపూసల దండ 8 గ్రాములు , చెవి దిద్దులు 4 గ్రాములు మరియు రూ.50,000 నగదు దొంగిలించినట్లు తేలింది.
ఈ రెండు కేసుల్లో నిందితుల వద్ద నుంచి రూ.45,000 నగదు, ఒక మొబైల్ ఫోన్, నల్లపూసల దండ 8 గ్రాములు, చెవి దిద్దులు 4 గ్రాములు కలిపి సుమారు రూ.2 లక్షల విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకోవడమైనది .
అరెస్టు చేసిన ఇద్దరు నిందితులను ఈరోజు గౌరవ దర్శి న్యాయస్థానం ముందు హాజరు పరచడం జరుగుతుంది.
ఈ కేసులను ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన దర్శి సిఐ వై రామారావు, తాళ్లూరు ఎస్సై S.మల్లికార్జునరావు, దొనకొండ ఎస్సై L.రామకృష్ణ, పోలీసు సిబ్బంది నాయక్, శ్రీను, గిరి, మహేష్, మాలకొండయ్యలను జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు అభినందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

దేవాలయాలు, ఇళ్లు, వ్యాపార సంస్థల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, విలువైన వస్తువులను భద్రంగా ఉంచుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ప్రజలందరికీ ఈ సందర్భం గా విన్నవించారు . ప్రజల సహకారంతో నేరాలను మరింత సమర్థవంతంగా అరికట్టవచ్చని తెలిపారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *