శ్రీ ఉజ్జయిని మహాకాళి బోనాల జాతర ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు….. సికింద్రాబాద్ డిసిపి రక్షితమూర్తి.

బేగంపేట జులై 9(జే ఎస్ డి ఎం న్యూస్) :
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి లష్కర్ బోనాల జాతరను అత్యంత వైభవంగా, ప్రశాంతవాతావరణంలో నిర్వహించేందుకు పటిష్టమైనబందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సికింద్రాబాద్ డీసీపీ రక్షిత మూర్తి
వెల్లడించారు. వచ్చే నెలలో జరగనున్న ఈ ఉత్సవాల ఏర్పాట్లపై గురువారంసోమసుందరం వీధిలోని విశ్వకర్మ సంఘం భవనంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో ఆమె ఉన్నత స్థాయి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, అమ్మవారి దర్శనార్థం తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. రద్దీని నియంత్రించేందుకు బోనాలతో వచ్చే మహిళల కోసం రెండు ప్రత్యేక క్యూలైన్లు, సాధారణ భక్తుల కోసం మరో నాలుగు క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. భద్రతలో ఎలాంటి లోపాలు లేకుండా ఆలయ ప్రాంగణంతో పాటు చుట్టుపక్కల పరిసరప్రాంతాలన్నింటినీ పూర్తి స్థాయిలో సీసీ కెమెరాల నిఘా నిఘాలోకితీసుకువస్తున్నామని చెప్పారు.
మహిళల రక్షణే ధ్యేయంగా జాతరలో షీ టీమ్స్‌ను పెద్ద సంఖ్యలో రంగంలోకి దించుతున్నామని, అలాగేజేబుదొంగతనాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు మఫ్టీలో నిరంతరం పహారా కాస్తారని డీసీపీ హెచ్చరించారు. ఉత్సవాల నిర్వహణపై ప్రజల నుండి వచ్చే సానుకూల సూచనలు, సలహాలను స్వీకరించి, వాటిపై తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమన్వయ సమావేశంలో ఏసీపీలు శ్రీధర్, యాదగిరి, శ్రీనివాస్, శంకర్ రాజులతో పాటు సీఐలు రవి కుమార్, సురేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. వీరితో పాటు మహంకాళి ఆలయ ఈవో గుత్తా మనోహర్ రెడ్డి, నూతన ట్రస్టు బోర్డు సభ్యులు కూడా హాజరై ఏర్పాట్లపై చర్చించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *