సికింద్రాబాద్, జులై 09 (జే ఎస్ డి ఎం న్యూస్) :
అమ్మవారికి శ్రావణమాసంతో పాటు ఆషాడ మాసం కూడా ఎంతో ప్రీతిపాత్రమైనదని మహిళా భక్తులు కొనియాడారు. సికింద్రాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ లోని మిస్సెస్ ఇండియా తెలంగాణ సుధా నాయుడు నివాసంలో ఆషాడ మాస
సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పసుపు, కుంకుమలుసమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం మహిళలందరూ ఒకరికొకరు పసుపు కుంకుమలు, తాంబూలాలు ఇచ్చుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సాంప్రదాయ దుస్తులలో మెరిసిపోయిన మహిళలు గోరింటాకు పెట్టుకుని పలు సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. అనంతరం వివిధ రకాల పిండి వంటకాలతో సహపంక్తి భోజనాలు చేశారు. మిస్సెస్ ఇండియా తెలంగాణ సుధాదేవి నేతృత్వంలో సాగిన ఈ వేడుకల్లో భవ్య, దివ్య, జాగృతి, నిశితా రెడ్డి, లావణ్య అదారి తదితరులు పాల్గొని సంబరాలను విజయవంతం చేశారు.




