ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థుల విద్య, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట -మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి-ఒంగోలులోని సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు నైట్ డ్రెస్, స్వెటర్స్ , షూస్, టర్కీ టవళ్ళు, బెడ్ షీట్స్, ట్రంక్ పెట్టెలు పంపిణీ చేసిన మంత్రి డా. స్వామి

ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థుల విద్య, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఒంగోలులోని జేడీ శీలం భవనంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు నైట్ డ్రెస్, స్వెటర్స్ , షూస్, టర్కీ టవళ్ళు, బెడ్ షీట్స్, ట్రంక్ పెట్టెలు, ప్లేట్, గ్లాసులు మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి, సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ బి. లావణ్య వేణి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ… రాష్ట్రంలోని అన్ని సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, డా. బి.ఆర్ అంబేద్కర్ గురుకులాల విద్యార్థులకు నైట్ డ్రెస్, స్వెటర్స్ , షూస్, టర్కీ టవళ్ళు, బెడ్ షీట్స్, ట్రంక్ పెట్టెలు, ప్లేట్, గ్లాసు పంపిణీ చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థుల విద్య, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఆ వర్గాల పిల్లలు చదువుకుంటేనే వారి కుటుంబాల్లో పేదరికం నిర్మూలించవచ్చన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పం అని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.143 కోట్లతో హాస్టళ్లకు మరమ్మతులు చేశాం. రూ. 200 కోట్లతో నూతన హాస్టళ్లు నిర్మిస్తున్నాం. బాలికల భద్రత కోసం హాస్టళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం, విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం డాక్టర్స్ బృందం ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మూడు ఐఐటీ, నీట్ ఎక్సలెన్సీ సెంటర్లు, బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రెండు ఎక్సలెన్సీ సెంటర్లు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఒక ఎక్సలెన్సీ సెంటర్ ఏర్పాటు చేశాం. వీటిలో విద్యార్థులకు ఇంటర్ తో పాటు జేఈఈ మెయిన్స్, ఐఐటీ, నీట్ కి ఉచిత శిక్షణ ఇస్తున్నాం. నర్సింగ్ విద్యార్థులకు జర్మనీ భాషలో ఉచిత శిక్షణ ఇచ్చి జర్మనీలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. ఈ ఏడాది ఇజ్రాయిల్ లో కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు గ్రూప్ 1, గ్రూప్ 2, డీఎస్సీ ఆర్ఆర్బీ, రైల్వే కోచింగ్ కి ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ఇస్తున్నాం. కౌసల్యం ద్వారా గ్రామాల్లో యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వర్క్ ఫ్రం హోం అవకాశాలు కల్పిస్తున్నాం. పేద విద్యార్థులు, యువత అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జేసీ పి. కల్పనా కుమారి, డీడీ లక్ష్మ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *