మంగమూరు రోడ్డు కూడలిలో ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ పి.రాజబాబు ఆదేశించారు.
బుధవారం ఆయన తరచూ ప్రమాదాలు జరుగుతున్న మంగమూరు రోడ్డు కూడలిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదాలు జరగకుండా డైవర్షన్ రోడ్డు ఏర్పాటు చేసే విధంగా సాధ్యసాధ్యాలను పరిశీలించాలని జాయింట్ కమిటీ అధికారులకు సూచించారు. తరచూ ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని దానిని నివారించే దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. అవసరమైతే ట్రాఫిక్కును దారిని మరలించాలని ఆయన సూచించారు.
ఎస్పీ హర్షవర్ధన్ మాట్లాడుతూ తరచూ ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నందున ట్రాఫిక్ నియంత్రణను పాటించాలని ఆయన సంబంధిత సిబ్బందికి సూచించారు.
ఈ కార్యక్రమంలో డిటిసి సుశీల, రోడ్లు భవనాల శాఖ ఈఈ గోపి నాయక్, నగరపాలక సంస్థ కమిషనర్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు .

