కులాలు, మతాలు, పార్టీల మధ్య విధ్వేష వ్యాఖ్యలు రేచ్చగొట్టె విధంగా ప్లేక్సీలు ప్రింట్ చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ ఐ మల్లిఖార్జున రావు అన్నారు. తాళ్లూరు పోలీన్ స్టేషన్లో బుధవారం మండలంలోని ప్లేక్సీల ప్రింటింగ్ యజమానులు, డిజైనర్స్ తో సమావేశం నిర్వహించారు. ఎస్సై మాట్లాడుతూ ప్లేక్సీల ప్రింటింగ్ నమయంలో ప్లేక్సీ ప్రింట్చేయు వారి పేరు, సెల్ నంబర్, ప్రింట్ కి ఆర్డర్ ఇచ్చిన వారి పేరు కూడ తప్పనిసరిగా ప్రచురించాలని ఆదేశించారు. పోలీన్ శాఖ ఇచ్చిన సూచనలు తూచ తప్పకుండా పాటించాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
