సికింద్రాబాద్ నవంబర్ 25,(జే ఎస్ డీ ఎం న్యూస్ ) :
నషా ముక్త్ భారత్ పాదయాత్ర బుధవారం గాంధీ ఆసుపత్రి వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నషా ముక్త్ భారత్’ ఆవశ్యకతపై ప్రసంగిస్తూ, మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ పాదయాత్రకు గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిరా, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి, ఫోరెన్సిక్ విభాగాధిపతి (హెచ్ఓడీ) ప్రొఫెసర్ డాక్టర్ బీవీ నాగమోహన్ రావు తదితరులు తరలివచ్చి సంఘీభావం తెలిపారు. అనంతరం అక్కడి నుంచి ముందుకు సాగిన పాదయాత్ర రాత్రి బస చేసే ముషీరాబాద్ చౌరస్తా సమీపంలోని కశిష్ ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకోవడంతో మొదటి రోజు యాత్ర ముగిసింది.

Save or share this story as a newspaper-style Epaper Clip: