హైదరాబాద్ నవంబర్ 25,(జే ఎస్ డీ ఎం న్యూస్ )
ప్రజా రవాణా వ్యవస్థే ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం అని
మెట్రో విస్తరణతో పాటు బస్సుల సంఖ్య పెరగాలని
నగరంలో ట్రాఫిక్, రవాణా వ్యవస్థపై ట్రాన్స్పోర్ట్ అఫ్ లండన్ సీ టీ ఓ శశి వర్మ అన్నారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నగర రవాణా, మెట్రో) ఎన్వీఎస్ రెడ్డి వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో చర్చా గోష్ఠిబుధవారం హైదరాబాద్ మెట్రో రైల్ భవన్ లో నిర్వహించారు. లండన్ నగర అనుభవాలతో హైదరాబాద్ మరియు ఇతర భారత నగరాలూ నేర్చుకోవలసిన అంశాలపై జరిగిన ఈ గోష్టిలో ట్రాన్స్పోర్ట్ అఫ్ లండన్ (TfL) చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శశి వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అయన TfL లో తన సుదీర్ఘ అనుభవాన్ని, లండన్ నగరం ఏ విధంగా ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తోంది, మరియు చేపట్టిన విప్లవాత్మక చర్యలను వివరించారు.
హైదరాబాద్ లో మూడు దశాబ్దాల క్రితం పనిచేశానని, ఇప్పుడు తిరిగి హైదరాబాద్ ని సందర్శిస్తున్నానని శశి వర్మ అన్నారు. ఈ మూడు దశాబ్దాలలో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి సాధించిందని ఆయన ప్రశంసించారు. 90 వ దశకంలో జరిగిన భారతీయ ఆర్థిక సరళీకృత విధానాలలో భాగంగా హైదరాబాద్ లో ఏ విధంగా సైబర్ సిటీకి పునాదులు పడ్డాయో అయన వివరించారు. ఆయన లండన్ అనుభవాలు, నేర్చుకోవలసిన పాఠాలు క్లుప్తంగాతెలియ జేశారు.అభివృద్ధి లో భాగంగా లండన్ విపరీతంగా విస్తరించడం వల్ల ఎదురైన ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి, 2000 సంవత్సరంలో అంతవరకు వివిధ సంస్థలుగా పని చేస్తున్న రైల్, రోడ్, అండర్ గ్రౌండ్ (లండన్ మెట్రో), బస్, సబర్బన్ రైల్ వంటి 14 సంస్థలను ఏకీకృతం చేసి 2000వ సంవత్సరంలో
TfL ఏర్పాటు, సర్వాధికారాలు కలిగిన లండన్ మేయర్ వ్యవస్థ ఏర్పాటు అక్కడి ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి చాలా వరకు దోహదం చేసాయి.నగరాల ఏర్పాటు ముఖ్య ఉద్దేశంజనసాంద్రతను నగరాలలో ఒక చోట పెంచి
ఉత్పాదకతకు తోడయ్యేలా చేయడం. అయితే ఈ అధిక ఉత్పాదకతతో పాటు అత్యధిక జనసాంద్రత, వ్యక్తిగత వాహనాల విస్ఫోటనం వల్ల ట్రాఫిక్, కాలుష్య సమస్యలు విపరీతంగా పెరుగుతాయి. కేవలం రోడ్ల వైశాల్యం పెంచడం నగరాల్లో అంత సులభం కాదు. పైగా ఇది ముఖ్య పరిష్కార మార్గం కూడా కాదు. అలాగే ఫ్లైఓవర్ల నిర్మాణం, ఇతర చర్యలు ట్రాఫిక్ సమస్యలకు కొంత వరకే పరిష్కారం చూపుతాయి. ట్రాఫిక్ సమస్యపరిష్కారానికి ప్రజారవాణా వ్యవస్థబలోపేతం,
చక్కటి ఫుట్ పాత్ ల నిర్మాణం చాల ముఖ్యం అన్నారు.
ప్రజారవాణా వ్యవస్థ కింద మెట్రో రైల్ విస్తరణతో పాటు, బస్సుల సంఖ్య గణనీయంగా పెంచవలసి వస్తుంది. బస్సులు, వెడల్పైన ఫుట్ పాత్ లు ఏర్పాటు చేయడం ద్వారా మొదటి-చివరి గమ్యం (ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ) అనుసంధానం జరిగి ఎక్కువ మంది ప్రయాణీకులు ప్రజారవాణా వ్యవస్థకు మొగ్గు చూపుతారన్నారు.
రాష్ట్రాల, దేశ ఆర్ధిక వ్యవస్థలలో నగరాలు అత్యంత ప్రధానమైన సాధనాలుఅవుతాయి. నగరాల అభివృద్ధి పై దృష్టి పెట్టి తద్వారా రాష్ట్ర, దేశ సంపదను పెంచడాన్ని ముఖ్య ఉద్దేశంగా పాలకులు, ఉన్నతాధికారులు గుర్తించి, దానికి తగ్గట్టుగా కృషి చేయాలి. మెట్రో విస్తరణంతో పాటు, తక్కువ ఖర్చుతో కూడిన ప్రజారవాణా వ్యవస్థలపై పాలకులు దృష్టి పెట్టాలన్నారు.హైదరాబాద్ లో ప్రజా రవాణా వ్యవస్థ ఒకప్పుడు 40 శాతం పైగా ఉండగా, అది ఇప్పుడు 28 శాతానికి పడిపోవడం ఆందోళన కరంగా మారింది. ప్రజా రవాణా శాతాన్ని తిరిగి ముందు 40 శాతానికి, ఆ తర్వాత 60 శాతానికి పైగా పెంచకపోతే భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్య మరింత క్లిష్టం అవుతుంది.
అనేక విప్లవాత్మక సంస్కరణలతోను, అధిక ప్రభుత్వ పెట్టుబడులతోనూ; ప్రజారవాణా వ్యవస్థ బలోపేతం చేయడానికి ప్రభుత్వం అనేక ఆర్థిక, ఆర్థికేతర చర్యలతో పాటు ప్రైవేటు వాహనాలపైన నియంత్రణ చర్యలు చేపట్టి లండన్ తో పాటు ప్రపంచంలోని ప్రముఖనగరాలన్నిటిలోనూ ట్రాఫిక్ సమస్యపరిష్కారానికి చాలా కృషి జరుగుతోంది. భారతీయ నగరాల్లో కూడా ఇటువంటి చర్యల ఆవశ్యకత ఉంది. ఈ చర్చాగోష్టి లో సికింద్రాబాద్ రైల్వే డివిజినల్ మేనేజర్ మరియు రవాణా రంగంలో పరిశోధన చేసిన డాక్టర్ ఆర్.గోపాలకృష్ణన్, హైదరాబాద్ మెట్రో రైల్ అదనపు మేనేజింగ్ డైరెక్టర్ బి.అజిత్ రెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ ఎం.రమేష్, UMTA ఎండీ జీవన్ బాబు, ట్రాఫిక్ రవాణా రంగాలకు చెందిన వివిధ ప్రభుత్వ శాఖలఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: