హైదరాబాద్ నవంబర్ 25,(జే ఎస్ డీ ఎం న్యూస్ )
క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతామంటూ బ్యాంక్ ప్రతినిధి పేరుతో ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు ఓ ప్రైవేట్ ఉద్యోగి ఖాతా నుంచి రూ. 41,793 కాజేశారు. బాపూబాగ్ కాలనీకి చెందిన అనుభవ్ గుప్తా (34)కు ఈ నెల 23న ఒక గుర్తుతెలియని మహిళ ఫోన్ చేసి, తాను బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రతినిధినని పరిచయం చేసుకుంది.
మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచే అవకాశం ఉందని, అందుకు వెరిఫికేషన్ నిమిత్తం పుట్టిన తేదీ చెప్పాలని కోరింది. ఆమె మాటలు నమ్మిన బాధితుడు తన పుట్టిన తేదీని చెప్పాడు. ఆ వెంటనే మొబైల్కు ఓటీపీలు వచ్చాయి. అయితే, బాధితుడు ఎవరికీ ఓటీపీ చెప్పనప్పటికీ, ఫోన్ కట్ అయిన వెంటనే ఆయన క్రెడిట్ కార్డ్ నుంచి రెండు విడతలుగా (రూ. 31,799 మరియు రూ. 9,994.28) మొత్తం రూ. 41,793.28 డెబిట్ అయినట్లు మెసేజ్లు వచ్చాయి. మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే కార్డును బ్లాక్ చేయించి, 1930 హెల్ప్లైన్కు సమాచారం అందించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఐటీ యాక్ట్, బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: