ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ CI కమలాకర్ ఆధ్వర్యంలో ఎస్సై చెంచయ్య, ఏ ఎస్ ఐ షేక్ మహబూబ్ బాషా మరియు సిబ్బంది దాడులు నిర్వహించారు. అక్రమ కోడి పందేల నిర్వహణపై ఒంగోలు టాస్క్ఫోర్స్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఒంగోలు రూరల్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలో మద్దిరాలపాడు గ్రామ పొలాల్లో మధ్య నిర్వహించిన దాడిలో కోడి పందేలు నిర్వహిస్తున్న 17 వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 3 కోళ్ళు 16 సెల్ ఫోన్లు 3మోటర్ సైకిల్, Rs50,300/- నగదును స్వాధీనం చేసుకున్నారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని, ప్రజలు ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. వారిని చర్యల నిమిత్తం ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ లో అప్పగించారు .
