నాగులుప్పలపాడు:జులై 16, ఉప్పుగుండూరు గ్రామ ప్రజల 50 సంవత్సరాల చిరకాల కోరిక అయిన కమ్యూనిటీ ప్రభుత్వ వైద్యశాల నిర్మాణాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావాలనే అడ్డుకుంటున్నారని టీడీపీ, బీజేపీ నాయకులు కనగాల శ్రీనివాసరావు, మసిముక్కు భాస్కరరావు, ఉప్పుగుండూరు లక్ష్మీనారాయణ, ఆత్మకూరు వాసు లు సంయుక్తంగా ఆరోపించారు.గురువారం ఉప్పుగుండూరులో సర్వే నెం. 78 వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో టీడీపీ గ్రామ అధ్యక్షులుకనగాల శ్రీనివాసరావు,సొసైటీ డైరెక్టర్ మసిముక్కు భాస్కరావు,టీడీపీ బీసీ సెల్ నాయకులు ఉప్పుగుండూరు లక్ష్మీనారాయణలు మాట్లాడారు.1940లో ఆనాటి గ్రామపెద్దలు ప్రజా అవసరాల కోసం సర్వే నెంబర్ 78లో 1 ఎకరా 50 సెంట్ల భూమిని ప్రభుత్వానికి దానంగా ఇచ్చారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక శాసనసభ్యులు బి ఎన్. విజయ్ కుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి లేఖ ద్వారా ఆసుపత్రి ఏర్పాటు చేయాలని కోరారని చెప్పారు. బుధవారం ఆ భూమిలో సర్వే జరుగుతుండగా వైసీపీ ఎంపీటీసీ మున్నంగి వెంకటరావు అడ్డుకున్నారని, ఆ భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. వాటర్ ట్యాంక్ ఎదురుగా ఉన్న సర్వే నెం. 78 లోనే ఆసుపత్రి నిర్మాణం జరగాలని గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారన్నారు.ప్రభుత్వ ఆసుపత్రి లేకపోవడంతో అత్యవసర సమయాల్లో సకాలంలో వైద్యం అందక ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ఎంపీటీసీ పై వెంటనే చర్యలు తీసుకొని సర్వే నెం.78 లో కమ్యూనిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని వారు తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణాన్ని అడుగడుగునా అడ్డుకుంటున్న వైసిపి ఎంపీటీసీపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు నియోజకవర్గ తెలుగు యువత ప్రధాన కార్యదర్శిపిన్నక శ్రీకాంత్ క్లస్టర్ ఇంచార్జ్ కొప్పర్తి నాగయ్య బీజేపీ నాయకులు ఆత్మకూరు వాసు,మాజీఎంపీటీసీకొండ్రు ఆశీర్వాదం,కత్తి నాగార్జున,టీడీపీ నాయకులు బెల్లం శ్రీనివాసరావు, తెలగతోటి సుబ్బయ్య, గోగినేని దుర్గ, గోపి, నల్లూరి భాస్కరావు, సింగరయ్య, యలమంచి శ్రీను,తదితరులు పాల్గొన్నారు.
