పొగాకు రైతులతో తాడే పల్లిలో మాజీ సీఎం వైఎన్ జగన్మోహన్ రెడ్డి తో బుధవారం జరిగిన సమావేశంలో వైసీపి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మలు పాల్గొన్నారు. అనంతరం ఇటీవల ప్రకాశం, మార్కాపురం జిల్లాలో పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని వైసీపీ శ్రేణులు, రైతులతో కలిసి చేసిన పోరాటాలను వివరించారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మను మాజీ సీఎం వైఎన్ జగన్మోహన్ రెడ్డి అప్యాయంగా పలకరించారు.

