బల్కంపేట జులై 22(జే ఎస్ డి ఎం న్యూస్) :
అందరిసహకారంతో బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం ఘనంగా జరిగిందనిమాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.బుధవారం బల్కంపేట ఎల్లమ్మ రధోత్సవాన్ని ఆయన శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుండి వచ్చిన లక్షలాది మంది భక్తుల సమక్షంలో అమ్మవారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగిందని చెప్పారు. ఆలయ పరిసర ప్రాంత ప్రజలు, వివిధ శాఖల అధికారులు, రాజకీయ పక్షాలు ప్రతి ఒక్కరి సంపూర్ణ సహకారంతో నే అమ్మవారి కళ్యాణం, రధోత్సవం నిర్వహించుకోవడం జరిగిందని అన్నారు. అమ్మవారి దీవెనలతో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండి ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, ఆలయ ట్రస్టీ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఈ ఓ వినోద్ రెడ్డి, డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు ప్రవీణ్ రెడ్డి, అశోక్ యాదవ్, కరుణాకర్ రెడ్డి, కట్టా బలరాం, రాజేష్ ముదిరాజ్, గుడిగే శ్రీనివాస్ యాదవ్, పీయూష్ గుప్త, గిరి యాదవ్, సురేందర్ తదితరులు ఉన్నారు.

