ఒంగోలులోని కాపునాడు కార్యాలయంలో కాపునాడు ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించారు. ఒంగోలు పార్లమెంట్ కాపునాడు అధ్యక్షులు పోగుల మల్లికార్జునరావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో
అధ్యక్షులు మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లా కాపు మహిళలని చైతన్యం పరిచేందుకు కాపునాడు మహిళా కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రకాశం జిల్లా కాపునాడు మహిళా అధ్యక్షురాలుగా మారాబత్తుల సుజాత ని నియమిస్తున్నామని తెలియజేశారు.
ఈ సమావేశంలో ఒంగోలు పార్లమెంట్ కాపునాడు జనరల్ సెక్రెటరీ దాసరి పిచ్చయ్య మాట్లాడుతూ ఆగస్టు 16వ తారీకు రాష్ట్రంలో ఉన్న 25 పార్లమెంటరీ కాపునాడు కమిటీ సభ్యులతో కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ళ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలియజేశారు.కా వున ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న కాపునాడు సభ్యులు మహిళా కాపునాడు సభ్యులు యువకాపునాడు సభ్యులు అందరూ హాజరు కావాలని కోరారు.
ఈ సమావేశంలో కాపునాడు జోన్ 4 మహిళా అధ్యక్షురాలు కొల్లా భువనేశ్వరి, రాష్ట్ర మహిళా కాపునాడు ఉపాధ్యక్షురాలు నగుబోతు నిర్మల, ఒంగోలు పార్లమెంటరీ మహిళా కాపునాడు ప్రధాన కార్యదర్శి కంటా లక్ష్మీ ప్రసన్న ,ఒంగోలు పార్లమెంటరీ కాపునాడు కోశాధికారి చెంగలశెట్టి సుధాకర్, యువజన అధ్యక్షులు బండారు సురేష్, మార్కాపురం జిల్లా కన్వీనర్ వెలుగోలు కాశీ విశ్వనాథ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
