తల్లిపాలు అమృతంతో సమానం అని వక్తలు అన్నారు.
ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా సోమవారం దర్శి పురపాలక సంఘం పరిధిలోని శివాలయం వీధి, రామాలయం గుడిగొర్ల గడ్డ అంగన్వాడి కేంద్రాల్లో తల్లుల సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ సి.హెచ్. సుభాషిని మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు మొదటి టీకాతో సమానమన్నారు. తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని, మేధస్సు పెరుగుతుందని తెలిపారు. బిడ్డ శారీరకంగా, మానసికంగా, సామాజికంగా సమగ్రంగా ఎదగడానికి తల్లిపాలు కీలకమని వివరించారు.
గర్భిణులు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న పౌష్టికాహారాన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో సూపర్వైజర్లు కె. అనురాధ, వి. కమల కుమారి, బి. ఇందిర, బి. సునీత అంగన్వాడి కార్యకర్తలు, ఆయాలు ఎం. రవణమ్మ, ఎస్. నాగజ్యోతి, బి. అచ్చమాంబ, ఎం. విజయమ్మ, పి. విజయలక్ష్మి, వై. సంధ్యారాణి, ఆశా కార్యకర్తలు ఎం. మాధవిలత, పార్వతి తో పాటు గర్భిణులు, బాలింతలు, తల్లులు పాల్గొన్నారు.
