సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో పూజలలో పాల్గొన్న మంత్రి పొన్నం.

సికింద్రాబాద్ ఆగస్ట్ 3,(జే ఎస్ డి ఎం న్యూస్) :
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆషాడ బోనాల జాతరలో రెండవ రోజైన సోమవారం రంగం (భవిష్యవాణి) కార్యక్రమం జరిగింది. ముఖాన పచ్చని పసుపు పూసుకుని నుదుటన ఎర్రని బొట్టు పెట్టుకుని చేతులో తంబుర పట్టుకొని అమ్మవారికి ఎదురుగా మాతంగేశ్వరి ఆలయం ముందు పచ్చి కుండ పై నిలబడి అమ్మ వారిని ఆవాహనము చేసుకొని మాతంగి స్వర్ణలతభవిష్యవాణివినిపించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవాదాయ శాఖ ప్రినిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ , కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా తదితరులు పాల్గొన్నారు.
అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయన్నారు. అమ్మవారి రంగం కార్యక్రమంలో భవిష్యవాణి లో
తెలంగాణ లో మంచి వర్షాలు పడతాయని చెప్పారన్నారు.
రాష్ట్రంలో సమృద్ధి వర్షాలతో పాడి పంటలతో ప్రజలంతా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని తెలంగాణ సాంప్రదాయ ఆచారలతో ఆషాఢ మాస బోనాలకు ప్రభుత్వం తరుపున అన్ని రకాలఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.
దేవాదాయ శాఖ, రెవెన్యూ అన్ని విభాగాల శాఖలు భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగిందనీ,
ప్రభుత్వం ఏర్పాటు చేసిన సౌకర్యాలు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు మంచి సౌకర్యాలతో మూడింతలు భక్తులు వచ్చారనీ మంత్రి తెలియజేశారు. కొంత భక్తులకు ఇబ్బంది కలిగిందనీ తన దృష్టికి వచ్చిందన్నారు.
హైదరాబాద్ ప్రజలకుధన్యవాదాలు తెలియ జేస్తున్నన్నారు. బోనాల సందర్భంగా లక్షలాది మంది వచ్చిన ట్రాఫిక్ తదితర ఇబ్బందులు కలిగినసహకరించారన్నారు.
రెవెన్యూ, పోలీస్ ,దేవాదాయ శాఖ, అన్ని విభాగాల సమన్వయం తో బోనాలుసమర్థవంతంగానిర్వహించడం జరిగిందన్నారు.
దేవాలయాలకు వెళ్లినపుడు దర్శనాలకు గుర్తింపు కార్డు ఇవ్వాలని జోగిని లు కోరారన్నారు.జోగిని లకు మున్సిపల్ కోపరేషన్ లో సభ్యులు గా ఇవ్వాలని వారికి కేబినెట్ నిర్ణయించిందనీ, వారికి ఉద్యోగాలు ఇస్తున్నామని పొన్నం వెల్లడించారు.
దేవాదాయ శాఖ కమిటీ కి
సంబంధించి వారికి గుర్తింపు ఇచ్చే విషయంలో ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు.
అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన పై దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, అధికారులతో కలిసి కమిటీ ఏర్పాటు చేసి నివేదిక మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందనీ పొన్నం ప్రభాకర్ తెలియ జేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *