సికింద్రాబాద్ ఆగస్ట్ 3,(జే ఎస్ డి ఎం న్యూస్) :
జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా సోమవారం గాంధీ ఆసుపత్రిలో అవయవ దానంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. నెఫ్రాలజీవిభాగాధిపతులు డా.మంజూష, డా.శ్రీనివాస్ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా. ఇందిర, డిప్యూటీ సూపరింటెండెంట్ డా.కె. సునీల్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ డా.నాగమోహన్, నర్సింగ్విద్యార్థులు,సిబ్బంది పాల్గొన్నారు.బ్రెయిన్ డెడ్ అయిన వారి అవయవాలను దానం చేయడం ద్వారా పలువురికి ప్రాణదానం చేయవచ్చని వైద్యులు పేర్కొన్నారు. కిడ్నీ మార్పిడి సేవలకు సహకరిస్తున్న డీఎంఈ డా.ఎన్. వాణికి నెఫ్రాలజీ విభాగం వైద్యులు కృతజ్ఞతలు తెలిపారు.
