సికింద్రాబాద్, ఆగస్ట్ 3 (జే ఎస్ డి ఎం న్యూస్) :
అందరి సహకారం, కృషి తో మహంకాళి అమ్మవారి బోనాల జాతర వైభవంగా నిర్వహించుకున్నామని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం ఆయన మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద బోనాల జాతర సందర్భంగా సేవలు అందించిన పలు శాఖల అధికారులు, వాలంటీర్లను శాలువాతో సత్కరించి డెక్కన్ మానవ సేవా సమితి శతాబ్ది ఉత్సవాల మెమేంటోలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి దర్శనం కోసం, బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన భక్తులకు ఏర్పాట్లు చేయడంలో కృషి చేసిన వివిధ శాఖల అధికారులు, భక్తులకు సేవలు అందించిన వాలంటీర్లు, రెండు రోజుల పాటు ఆలయం వద్దే ఉండి తమ మాధ్యమాల ద్వారా కవరేజ్ చేసిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. సన్మానం పొందిన వారిలో GHMC, వాటర్ వర్క్స్, దేవాదాయ శాఖ, ఆలయ పండితులు, హెల్త్, ఎలెక్ట్రికల్, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో పాటు డెక్కన్ మానవ సేవా సమితి సభ్యులు, నల్లగుట్ట మిత్ర మండలి, మక్తాల ఫౌండేషన్, పలువురు స్వచ్చంద వాలంటీర్లు ఉన్నారు. కార్యక్రమంలో డెక్కన్ మానవ సేవా సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, నాయకులు కొండాపురం మహేష్ కుమార్ యాదవ్, కిషోర్, ఆనంద్ పాటిల్, రాం మోహన్ యాదవ్, అరుణ్ భట్, జయరాజ్, సత్యనారాయణ, చంద్ర ప్రకాష్ శర్మ, సమితి సభ్యులు కమల్ కుమార్, నర్సింగ రావు, హరిబాబు యాదవ్, రఘుమోహన్, నాయుడు, శశాంక్, అనురాగ్ తదితరులు ఉన్నారు.






