మెలుకువలు పాటిస్తే పట్టు పరిశ్రమ లాభసాటిగా సాగు చేసుకోవచ్చని జిల్లా పట్టుపరిశ్రమ శాఖాధికారి నుజయ్ కుమార్ అన్నారు. తాళ్లూరు రైతు సేవా కేంద్రంలో మంగళ వారం నా పట్టు నా అభిమానం 2. 0 కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా పట్టు పరిశ్రమశాఖాధికారి సుజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ పెట్టు బడుతు తగ్గిస్తూ ప్రకృతి వ్యవసాయంలో పట్టు పరిశ్రమను ముందుకు తీసుకెళ్తే తక్కువ ఖర్చుతో మంచి లాభదాయకంగా ఉండే అవకాశం ఉందని చెప్పారు. నీటికి పొదుపుగా వాడుకునేందుకు డ్రిప్ పద్దతి ఉపయోగించుకోవాలని సూచించారు. గతంలో సాగు చేసిన రైతులు పట్టు పరిశ్రమ వలన కలిగిన ఇబ్బందులను, తమ అనుభవాలను వివరించారు. అందుకు శాస్త్రవేత్తలు డాక్టర్ జయ శ్రీ, సౌజన్య తగిన సూచనలు చేసారు. వి బి జీ రామి పథకంలో కూడ పట్టు పరిశ్రమకు ఇస్తున్న చేయూతను ఎపీఓ వెంకటేశ్వర్లు వివరించారు. మొక్కల మధ్యను ఫ్రీ మాన్ నూన్ విత్తనాలు చల్లి, కలియ దున్ని మొక్కలను సారవంతంగా చేసుకోవచ్చని వ్యవసాయధికారి ప్రసాద రావు వివరించారు.


