ప్రజా మరుగుదొడ్ల స్థలం కబ్జాపై మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి తక్షణ స్పందన.సనత్‌నగర్

(జే ఎస్ డి ఎం న్యూస్) :
తమ బస్తీలో ఉన్న ప్రజా మరుగుదొడ్ల (పబ్లిక్ టాయ్ లెట్లు) స్థలం కబ్జాకు గురైంది అంటూ స్థానికులు సనత్ నగర్ మాజీ ఎమ్మెల్యే, బిజెపి నాయకులు మర్రి శశిధర్ రెడ్డి ని కలిసి వినతి పత్రం అందించారు. స్పందించిన శశిధర్ రెడ్డి వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. సమస్య తీవ్రతను వివరించేందుకు బోయిన్ పల్లి సర్కిల్ 3 డిప్యూటీ కమిషనర్ కు ఫోన్ చేశారు. ఆయన అందుబాటులోకి రాకపోవడం తో వివరాలను మెసేజ్ రూపంలో ఆయనకు పంపించారు. అనంతరం మల్కాజ్ గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి దృష్టికి కబ్జా వ్యవహారాన్ని తీసుకెళ్లి వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆక్రమణలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మంగళవారం భగవంతపూర్ లో జరుగుతున్న ఎస్.ఐ.ఆర్ (SIR) కార్యక్రమాన్ని పరిశీలించేందుకు వెళ్లిన మర్రి శశిధర్ రెడ్డిని స్థానిక బస్తీ వాసులు శ్యామ్‌సుందర్, అశోక్ యాదవ్, జగదీష్, దయాకర్ రెడ్డి తదితరులు కలిసి వినతిపత్రం అందజేశారు. భగవంత్‌పూర్‌లోని పబ్లిక్ టాయిలెట్స్ (ప్రజా మరుగుదొడ్లు) స్థలం ఆక్రమణకు (కబ్జాకు) గురికావడంతో తాము ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులను బస్తీవాసులు ఆయనకు వివరిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.మర్రి శశిధర్ రెడ్డి వెంట బి ఎల్ ఏ 1, మహంకాళి జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి నెమలి ఆనంద్ (నందు) తదితరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *