ఆటోబిక్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో ఈజీ ఫార్మసీ యాప్.

హైదరాబాద్ ఆగస్ట్ 4,(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఆటోబిక్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో ఈజీ ఫార్మసీ యాప్ ను అందుబాటు లోకి తీసుకు వచ్చారు.
వినియోగదారులను సమీప మెడికల్ షాపులతో అనుసంధానించే ‘ఈజీ ఫార్మసీ’ యాప్‌ను వైద్య నిపుణులకు అడ్రోటెక్ సొల్యూషన్స్ పరిచయం చేసింది.
ఈ వినూత్న డిజిటల్ హెల్త్‌కేర్ వేదిక’ ఈజీ ఫార్మసీ’ (Eazy Pharmacy) యాప్‌నుహైదరాబాద్‌లోని కంట్రీ క్లబ్‌లో నేషనల్ ఇంటిగ్రేటెడ్ మెడికల్అసోసియేషన్ (NIMA)
ఆధ్వర్యంలో నిర్వహించిన మెడికో-లీగల్ & ప్రాక్టీస్ ప్రొటెక్షన్ ఫోరం వర్క్‌షాప్‌లో వైద్య నిపుణులకు పరిచయం చేశారు.
సాంకేతికతను వినియోగించి నాణ్యమైన, అసలైన ఔషధాలను అందుబాటు ధరల్లో, సులభంగా ప్రజలకు చేరవేయాలనే లక్ష్యంతో ఈజీ ఫార్మసీరూపొందించారు .వినియోగదారులు తమ ఇంటి నుంచే వాట్సాప్ ద్వారా సులభంగా మందులను ఆర్డర్ చేయగలిగే విధంగా ఈ ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి చేశారు. ముఖ్యంగా చివరి మైలు (లాస్ట్ మైల్) ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయడం, మందుల కోసంప్రయాణించాల్సిన ఇబ్బందులను తగ్గించడం,సమయానికి అసలైన
మందులు అందేలా చేయడం ఈ యాప్ ప్రధాన ఉద్దేశ్యం. ఈజీ ఫార్మసీ వినియోగదారులను వారి సమీపంలోని విశ్వసనీయమైన మెడికల్ షాపులతో అనుసంధానిస్తూ సమగ్ర డిజిటల్ హెల్త్‌కేర్ వ్యవస్థను రూపొందిస్తుంది. దీంతోవినియోగదారులు తక్కువ సమయంలో సమీపంలోని ఫార్మసీల నుంచి మందులను పొందవచ్చు. అదే సమయంలో స్థానిక మెడికల్ షాపులు తమవినియోగదారుల సంఖ్యను పెంచుకోవడంతో పాటు సేవలను విస్తరించుకొని అదనపుఆదాయాన్ని కూడా పొందే అవకాశంకలుగుతుంది.అన్ని వయస్సుల వారికి, సాంకేతిక పరిజ్ఞానం తక్కువగాఉన్నవారికి కూడా సులభంగా ఉపయోగించుకునేలా ఈ యాప్ రూపొందించబడిందిముఖ్యంగావృద్ధులు, స్మార్ట్ ఫోన్ వినియోగంలో అనుభవం లేని వారు, గ్రామీణ మరియువెనుకబడిన ప్రాంతాల్లో నివసించే ప్రజలను దృష్టిలో ఉంచుకుని వాట్సాప్ ఆధారిత ఆర్డరింగ్ విధానాన్ని అభివృద్ధి చేశారు. సమర్థవంతమైన లాజిస్టిక్స్ వ్యవస్థ ద్వారా దూర ప్రాంతాలకు కూడా నిర్ణీత సమయంలో మందులను చేరవేసే సౌకర్యంకల్పించారు. వినియోగదారులు, మెడికల్ షాపులతో పాటు వైద్యులు, క్లినిక్‌లు,ఆసుపత్రులు మరియు ఇతర ఆరోగ్య సంస్థలకు కూడా ఈజీ ఫార్మసీ ఉపయోగకరంగా ఉంటుంది. వైద్యులు సూచించినమందులను రోగులు
సమీపంలోని విశ్వసనీయ ఫార్మసీల నుంచి సులభంగా పొందేలా ఈ ప్లాట్‌ఫారమ్ సహకరిస్తుంది. దీంతో చికిత్సలో నిరంతరత పెరగడంతో పాటు మెరుగైన వైద్య ఫలితాలు సాధించడానికి దోహదపడుతుంది.
ఈ సందర్భంగా చల్లా చిరంజీవి, ఫౌండర్ మరియు సీఈఓ, అడ్రోటెక్ సొల్యూషన్స్ మాట్లాడుతూ ఈజీ ఫార్మసీ యాప్ ప్రత్యేకతలను వివరించారు. వైద్య సేవల నాణ్యతను, సామర్థ్యాన్ని పెంచడంలో ఈ యాప్ ఎలా ఉపయోగపడుతుందో ప్రదర్శించారు. అత్యవసర పరిస్థితుల్లో లేదా రాత్రి వేళల్లో రోగులు మందుల కోసం ఒక మెడికల్ షాప్ నుంచి మరో మెడికల్ షాప్‌కు తిరగాల్సి వస్తోందని, దీనివల్ల సమయం వృథా కావడంతో పాటు చికిత్సఆలస్యమవుతోందని ఆయన తెలిపారు. ఈజీ ఫార్మసీ ద్వారా రోగులనుసమీపంలోని మెడికల్
షాపులతో అను సంధానించడం ద్వారా అసలైన మందులను వేగంగా అందించడంతో పాటు ప్రయాణ సమయం, ఇబ్బందులను గణనీయంగా తగ్గించవచ్చని ఆయన వివరించారు. తర్వాత యాప్ కు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించిన పూరం మహేందర్ రెడ్డి, కో ఫౌండర్, ఆడ్రోటెక్ సొల్యుషన్స్ మాట్లాడుతూ ఈ ప్లాట్‌ఫారమ్‌లో లభించేఆదాయాన్ని సరఫరా చేసే ఫార్మసీ మరియుప్లాట్‌ఫారమ్ మధ్యపంచుకునే విధానం అమలులో ఉంటుందని, ఇందులోభాగస్వామ్యమయ్యే ఫార్మసీలకు ఎటువంటి ప్రారంభ పెట్టుబడి లేదా ప్రత్యేకమైన వ్యవస్థలు వ్యయం అవసరం లేదని తెలిపారు. వైద్యులు, ఫార్మసీనిర్వాహకులు, ఆసుపత్రులు మరియు ఇతర ఆరోగ్య సేవల సంస్థలు ఈజీ ఫార్మసీనివినియోగించి తమ సూచనలు, అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు. వాటి ఆధారంగా ప్లాట్‌ఫారమ్‌ను మరింతసమర్థవంతంగాతీర్చిదిద్దుతామని తెలిపారు.
అనంతరం అడ్రోటెక్ సొల్యూషన్స్ ప్రతినిధులు వైద్య నిపుణులు అడిగిన వివిధ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, యాప్ నిర్వహణ, సేవలు, ప్రయోజనాలపై సమగ్ర వివరణ అందించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ అసోసియేషన్ (NIMA) సభ్యులు, అడ్రోటెక్ సొల్యూషన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *