మహిళ మెడలో గొలుసు తెంచుకెళ్లిన దుండగులు.

ఎల్బీనగర్ ఆగస్ట్ 4,(జే ఎస్ డి ఎం న్యూస్) :
నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రార్థనలు ముగించుకుని ఇంటికి వెళ్తున్న
ఓ మహిళను లక్ష్యంగా చేసుకుని ఆమె మెడలోని బంగారు గొలుసును దుండగులు తెంచుకుని పరారయ్యారు. బాధితురాలు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. జీవీఆర్ కాలనీకి చెందిన సాగ్గం ధనమ్మ (56) నాగోల్ ఆర్కే నగర్‌లోని చర్చిలో ప్రార్థనలు ముగించుకుని తిరుగుపయనమైంది. హెచ్‌పీ గ్యాస్ గోదాం సమీపంలోకి రాగానే పల్సర్ బైక్‌పై వచ్చిన ముగ్గురు అపరిచిత వ్యక్తులు ఒక్కసారిగా ఆమెపై దాడి చేసి,మెడలోని సుమారు రెండున్నర తులాల బంగారు పుస్తెల గొలుసును లాక్కున్నారు.
అనంతరం నిందితులు తట్టి అన్నారం వైపు వేగంగాపరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నాగోల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటన స్థలాన్ని వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డిపరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఆధారాలుసేకరిస్తున్నామని,నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లుపోలీసులు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *