డిగ్రీ ప్రవేశాలకు రెండు రోజులే గడువు

బేగంపేట ఆగస్ట్ 4,(జే ఎస్ డి ఎం న్యూస్) :
బేగంపేట్‌లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఓపెన్ యూనివర్సిటీ) స్టడీ సెంటర్‌లో 2026-27 విద్యాసంవత్సరానికి గానూ యూజీ, పీజీ ప్రవేశాల దరఖాస్తులకు ఆగస్టు 7తో గడువు ముగియనుందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. పద్మావతి తెలిపారు. ఆసక్తి గల మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి మరో రెండు రోజులు మాత్రమే అవకాశం ఉందన్నారు.
ఇంటర్మీడియట్, ఓపెన్ ఇంటర్, మూడేళ్ల పాలిటెక్నిక్ లేదా ఐటీఐ పూర్తయిన మహిళలు బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు అర్హులని పేర్కొన్నారు. వీటితో పాటు ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, తెలుగు, ఇంగ్లీష్ తదితర సబ్జెక్టులలో ఎంఏ కోర్సుల్లోనూ ప్రవేశాలు పొందే వెసులుబాటు ఉందని తెలిపారు. గతంలో ప్రవేశాలు పొంది ద్వితీయ, తృతీయ సంవత్సరాల ట్యూషన్ ఫీజు సకాలంలో చెల్లించని విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఫీజు చెల్లించవచ్చని స్టడీ సెంటర్ కో-ఆర్డినేటర్ డాక్టర్ మారోజు రామాచారి స్పష్టం చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *