ఆరోగ్య వంతమైన చిన్నారుల సమాజం అభివృద్ధికి తల్లిపాలు ఎంతో శ్రేయష్కరమనని జీ జీ హెచ్ పర్యవేక్షకులు డాక్టర్ మాణిక్య రావు అన్నారు. జి జి హెచ్ లో తల్లి పాల వారోత్సవాల సందర్భంగా గైనకాలజీ విభాగంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. గైనకాలజీ విభాగపు అధిపతి డాక్టర్ సంధ్యారాణి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. డాక్టర్ మాణిక్య రావు మాట్లాడుతూ తల్లిదండ్రులు పెద్దలు పాల విశిష్టత గురించి నేటి తల్లులకు చెప్పాలని కోరారు. బిడ్డ కు తొలి రోజు నుండే పాలు ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ వైద్యకశాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీ వాణి, డిప్యూటీ పర్యవేక్షకులు డాక్టర్ కిరణ్ కుమార్లు మాట్లాడుతూ క్రమం తప్పకుండా తల్లులకు అవగాహన కల్పించాలని, మంచి ఆరోగ్యానికి తల్లిపాలు కీలకమని చెప్పారు. పలువురు గర్భవతులు, బాలింతల కు అవగాహన కల్పించి వారి సందేహాలను సమాధానాలు ఇచ్చారు. సీ ఎస్ ఆర్ ఎం డాక్టర్ మాధవీ లత, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ సంధ్యా రాణి, డాక్టర్ నుమతి, అసిస్టెంట్ ప్రొఫిసర్స్ డాక్టర్ అపర్ణ, డాక్టర్ హైందవి, డాక్టర్ నీరజ్, డాక్టర్ మైధిలీ, డాక్టర్ పల్లవిలు పాల్గొన్నారు.
