క్షేత్ర స్థాయిలో పంచాయితీలలో మౌలిక వసతుల కల్పనకు తగిన ప్రణాళికలు తయారు చేసి గ్రామాల అభివృద్ధికి కృషి చెయ్యాలని జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి కోరారు. తాళ్లూరు మండల ప్రజా పరిషత్ సమావేశపు మందిరంలో బుధవారం గ్రామ పంచాయితీ – అభివృద్ధి ప్రణాళిక (జి పి డీ పీ) పై ఒక రోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఇన్చార్జి ఎంపీడీఓ శ్రీనివాస రావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పంచాయితీలలో మౌళిక వసతుల లేమి గుర్తింపుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. పంచాయితీ ప్రత్యేక అధికారులు, విద్యాశాఖాధికారి జి సుబ్బయ్య, ఎంఈఓ – 2 నుధాకర్ రావు, వ్యవసాయాధికారి ప్రసాద రావు, కార్యాలయ ఎవో గోపాల క్రిష్ణ, స్వర్ణ గ్రామ కార్యాలయ సిబ్బంది పొల్గొన్నారు.

