క్షయను ప్రారంభ దశ లో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని తాళ్లూరు పీహెచ్సీ వైద్యాధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. తాళ్లూరు పీహెచ్ సీ లో బుధవారం టీబి ముక్త్ భారత్ అభియాన్ 2.0 కార్యక్రమంలో బాగంగా ఛాతి పరీక్షలు నిర్వహంచి ఎక్స్ ను తీయించారు. డాక్టర్ రాజేష్ మాట్లాడుతూ రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం ఉంటే నిర్లక్ష్యం చేయకుండా ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పరీక్షలు నిర్వహించుకోవాలని చెప్పారు. 110 మందికి ఛాతి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసారు. గురువారం మన్నేపల్లిలో ఉచిత ఎక్స్రే పరీక్షలు నిర్వహించబడునని చెప్పారు. కార్యక్రమంలో టిబి హెచ్ వీ సాయి ప్రసాద్, హెల్త్ సూపర్ వైజర్ పివి రవి, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

