ప్రతి ఒక్కరికి భారత న్యాయ చట్టాలపై అవగాహన కలిగి మసలు కోవాలని తాళ్లూరు ఎస్పై మల్టిఖార్జున రావు కోరారు. ఎంపీడీఓ కార్యాలయ సమావేశపు మందిరంలో బుధవారం పొదుపు, ఫీల్డ్ అసిస్టెంట్స్, సచివాలయ సిబ్బందికు చట్టాలపై, ఆన్ లైన్ మోసాలపై, వాహన చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పై మల్లిఖార్జున రావు మాట్లాడుతూ నేటి డిజిటల్ యుగంలో రోజు రోజుకు ఆన్లైన్ మోసాలు పెరిగి పోతున్నాయని అన్నారు. ఒక్క ఓటిపి పొరపాటున చెప్పినట్లయితే వారు కష్టపడి సంపాదించుకున్న సొమ్ము పరుల పాలవుతుందని చెప్పారు. అత్యాశకు పోయి బెట్టింగ్లను పాల్పడవద్దని, జీవితాలను పాడు చేసుకోవద్దని చెప్పారు. వాహనాలు డ్రైవింగ్ సమయంలో సీటు బెల్ట్ పెట్టుకోవటం, హెల్మేట్ ధరించటం చెయ్యాలని కోరారు. ఎంఈఓ జి సబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

