బేగం పేట ఆగస్టు 8
(జే ఎస్ డి ఎం న్యూస్)
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆషాఢ బోనాల జాతర ను విజయవంతం చేయడం లో సహకారం అందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ను శనివారం మహంకాళి ఆలయ ఈ ఓ గుత్తా మనోహర్ రెడ్డి కలిసి పూల మాల శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు వేణు మాధవ శర్మ,ఆలయ ప్రధాన అర్హకులు ,ఎక్స్ అఫిషియో మెంబర్ రామ తీర్థ శర్మ వేద ఆశీర్వచనం అందించారు.ప్రసాదాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ శివలాల్,దేవి వర ప్రసాద్,మల్లిఖార్జున్,మంత్రి సోనాలి.తదితరులు ఉన్నారు.
