బేగంపేట్ ఆగస్ట్ 8(జే ఎస్ డి ఎం న్యూస్)
అందరి కృషి, సహకారం తోనే మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా జరిగాయని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బోనాల ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో వైభవంగా జరగడంతో మహంకాళి అమ్మవారి ఆలయ EO గుత్తా మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ పండితులు శనివారం వెస్ట్ మారేడ్ పల్లి లోని క్యాంప్ కార్యాలయంలో కలిసి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి అన్ని విధాలుగా సహకారాన్ని అందించి కృషి చేసిన నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఆలయ పండితులు ఆశీర్వచనం చేసి ప్రసాదాలు అందజేశారు.

