బేగంపేట ఆగస్ట్ 8(జే ఎస్ డి ఎం న్యూస్) :
చెత్త పేరుకున్నది.దోమలు దాడి చేస్తున్నాయి.బోనాల జాతరొచ్చిన చెత్త
తొలగించారా.సారూ. అంటూ డివిజన్ పరిధి లోని అంబేడ్కర్ నగర్ బస్తీ వాసులు అధికారులను ప్రశ్నిస్తున్నారు.గడచిన కొద్ది రోజులుగా బస్తీ ప్రధాన రోడ్డుపైన చెత్త పేరుకు పోయి తీవ్ర దుర్వాసన వెదజల్లు తుంది. ఈ సమస్యను స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పాటించుకోవడం లేదని.బోనాల జాతర సందర్భంగా బస్తీ మహిళలు బోనాలు ఎత్తుకుని సమీప బస్తీ లోని అమ్మవారి ఆలయానికి వెళతారని,స్థానికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సంబంధిత శాఖా ఉన్నతాధికారులు వెంటనే చెత్తను తొలగించాలని ,దోమల నివారణకు ఫాగింగ్ చేయాలని స్థానికులు కోరుతున్నారు.

