తాళ్లూరు మండలం బొద్దికూరపాడులో ఆదివారం పోలేరమ్మ తల్లి గ్రామ దేవతకు మూడవ రోజు పొంగళి నైవేద్యం చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామస్తులు అందరూ ఐక్యంగా పొంగళ్ల ఊరేగింపుగా మేళ తాళాలతో తీరుకువెళ్లి వర్షాలు కురిసి పంటలను, పశు పక్షాదులను చల్లగా చూడాలని మొక్కులు తీర్చుకున్నారు. పొంగళ్ల ఏర్పాటుతో బంధు మిత్రుల రాకతో గత మూడు రోజుల నుండి గ్రామంలో తిరునాళ్ల వాతావరణం నెలకొన్నది.

