బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న కే టి ఆర్,తలసాని.

బల్కంపేట ఆగస్టు 9,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఆషాడ బోనాల పండుగ సందర్భంగా బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ లు ఆదివారం బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ని దర్శించుకున్నారు. ముందుగా అమీర్ పేట లోని కనకదుర్గమ్మ ను దర్శించుకుని పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయ పండితులు ఆశీర్వచనం చేసి ప్రసాదాలు అందజేశారు. అనంతరం బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి చేరుకున్న వీరికి ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న అనంతరం ఆలయ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేసి ప్రసాదాలు అందజేశారు. అక్కడి నుండి బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి నివాసంలో నిర్వహించిన బోనాల వేడుకలలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, టి. మహేశ్వరి, కిరణ్మయి, సనత్ నగర్, మోండా డివిజన్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, నాయకులు అశోక్ యాదవ్, ప్రవీణ్ రెడ్డి, సురేష్ గౌడ్, టి.శ్రీహరి, నామన సంతోష్ కుమార్, రమేష్ గౌడ్, కరుణాకర్ రెడ్డి, కూతురు నర్సింహ, ప్రకాష్ గౌడ్, పీయూష్ గుప్తా, కిషోర్, కట్టా బలరాం, ప్రదీప్ గౌడ్, గుడిగే శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *