బోనాలు వేడుకలు సమగ్రతకు ప్రతీకలు – శాస్త్రీయత తో ముడిపడ్డ బోనాలు పండుగను సంతోషంగా జరుపుకోవాలి తీగుళ్ళ పద్మారావు గౌడ్.

సికింద్రాబాద్ ఆగస్టు 9 ,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
బోనాలు వేడుకలు సనాతన తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తాయని, శాస్త్రీయత కూడా ఉన్న
ఈ వేడుకలను ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ పరిధిలో బోనాలు సందర్భంగా వివిధ దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చారిత్రాత్మక చిలకలగూడా కట్ట మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజల్లో పద్మారావు గౌడ్ పాల్గొన్నారు. ఆలయం మర్యాదలతో పద్మారావు గౌడ్ కు అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ తెలంగాణ సంస్కృతికి బోనాలు దర్పణం పడుతుందని అన్నారు. రాజకీయాలు, కుల మతాలకు అతీతంగా బోనాలు వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. కట్ట మైసమ్మ దేవాలయానికి నిధులను సమకూర్చడంతో పాటు విస్తరణకు తగిన స్థలాన్ని కూడా సమకూర్చామని తెలిపారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాల్లో జరిగే బోనాలు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవాలని పద్మారావు గౌడ్ సూచించారు. నియోజకవర్గం పరిధిలోని సుమారు 212 దేవాలయాలకు దాదాపు రూ. కోటీ 12 లక్షలకు పైగా నిధులను మంజూరు చేయించమని తెలిపారు. బీ. ఆర్. ఎస్. యువ నేతలు తీగుళ్ళ కిశోర్ కుమార్, రామేశ్వర గౌడ్, తాజా మాజీ కార్పొరేటర్లు సామాల హేమ, కంది శైలజ, రాసురి సునీత, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *