బేగంపేట డివిజన్ పరిధిలో వివిధ దేవాలయాల్లో కోట,విశాల్ పూజలు.అమ్మవారు అందరిని చల్లగా చూడాలి.కోట నీలిమ.

బేగంపేట ఆగస్ట్ 9,(జే ఎస్ డి ఎం న్యూస్) :
బేగంపేట డివిజన్ పరిధిలో వివిధ దేవాలయాల్లో సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డా.కోటనీలిమ ,బేగంపేట డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు విశాల్ సుధామ తో కలిసి వివిధ దేవాలయాల్లో బోలా జాతర సందర్భంగా నిర్వహించిన పూజల లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రకాశం నగర్ లోని శ్రీ భూలక్ష్మమ్మ అమ్మవారి ఆలయంలో విశాల్ కోట నీలిమతో ప్రత్యేక పూజలు నిర్వహింపజేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ముందుగా నీలిమను శాలువాలతో ఘనంగా సత్కరించారు.అనంతరం డివిజన్ పరిధిలోని వివిధ దేవాలయాల్లో నిర్వహించిన బోనాల వేడుకల్లో పాల్గొని పూజలు చేశారు.ఈ సందర్భంగా కోట నీలిమ మాట్లాడుతూ ఆషాఢ బోనాలలో అమ్మవారు ఎంతో ఆనందంగా ఉంటారని అన్నారు.బోనాలు తెలంగాణా సంస్కృతి ,సంప్రదాయాలు,ఆచారాలకు ప్రతీక అని అన్నారు.అమ్మవారు ప్రజలు అందరిని చల్లగా చూడాలనీ కోట నీలిమ అమ్మవారిని వేసుకున్నారు. కోట నీలిమ వెంట డివిజన్ కాంగ్రెస్ పార్టీ నేతలు,కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *